Tuesday, 3 November 2026

మహనీయుల సేవలు మరువలేనీవి

మహనీయుల సేవలు మరువలేనీవి
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథంఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 5 : దేశానికి మహనీయులు చేసిన సేవలు మరువలేనివని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం అన్నారు. బుధవారం మండలం పరిధిలోని కొండేరు గ్రామంలో తన నివాసంలో డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ 116వ  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మంద జగన్నాథం, అలంపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మంద శ్రీనాథ్ కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితంగానే మన దేశం సుభిక్షంగా ఉందని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్లుగా అమలుపరచడానికి  జగ్జీవన్ రామ్ చేసిన కృషి వర్ణించలేనిదన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు అనేక నూతన వ్యవసాయ సంస్కరణలు తెచ్చిన వ్యక్తి జగ్జీవన్ రావ్ అన్నారు. వారి చేసిన సేవలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొండేరు సర్పంచ్ వీరన్న, ఎంపీటీసీ వీరన్న, జింకలపల్లి రాంరెడ్డి, ఏకాంత్, జింకలపల్లి సర్పంచ్ ఈదన్న, బషీర్ మియా, మంద యోహాను, నెంబర్ ఏసన్న ,పాల బీచుపల్లి, వేంకటస్వామి గౌడ్, బాలు మోహన్, దిలిప్ తదితర బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
బెటాలియంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
బీచుపల్లి పదవ బెటాలియన్ లో కమాండెట్ రాంప్రకాష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని  అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 సంవత్సరాలు పాటు కేంద్ర మంత్రిగా ఉంటూ భారతదేశ ఉప ప్రధానిగా ఉంటూ ప్రజారాజ నిర్మాణానికి నిరంతర కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఆర్ఐలు రాజేష్, రాజారావు, రమేష్, శ్రీధర్, తదితర బెటాలియన్ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.