నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు అన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి, కమీషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు,కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్ ,మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, వలంసెట్ల రమేష్ బాబు, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




