Tuesday, 3 November 2026

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం.

   ఎస్పీ అఖిల్ మహాజన్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 5. (జనంసాక్షి). డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు.సంఘసంస్కర్తగా వెనుకబడిన వర్గాల నుంచి భారత పార్లమెంటులో 40 సంవత్సరాల పాటు ఆయన విశిష్టమైన సేవలను అందించాలని గుర్తు చేశారు.ఆయన జీవితం ఆదర్శనీయమని స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.