ఘనంగా బాలల దినోత్సవం.
నెన్నెల, నవంబర్ 14, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా బాలల దినోత్సవం నిర్వహించారు. చిన్నారులు ముద్దుగా చాచా అని పిలుచునే నెహ్రు కు చిన్నారులు అంటే ఎంతో ఇష్టపడేవారని అయిన గుర్తుగా ఆయన జయంతి సందర్బంగా బాలల దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని సర్పంచ్ ఇందూరి శశికళ తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులకు పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్, సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయులు మేరీ, అనూష, సంగీత , అంగన్వాడీ కార్యకర్త రాజమణి, విద్యార్థులు పాల్గొన్నారు




