ఘనంగా బాలల దినోత్సవం.
జహీరాబాద్ నవంబర్ 14, (జనంసాక్షి )
జహీరాబాద్ పట్టణంలోని పస్తపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీ క్రిష్ణ వేణి పాఠశాలలో సోమవారం భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా బాలల దినోత్సవం నిర్వహించారు. చిన్నారులు ముద్దుగా చాచా అని పిలుచునే నెహ్రు కు చిన్నారులు అంటే ఎంతో ఇష్టపడేవారని అయిన గుర్తుగా ఆయన జయంతి సందర్బంగా బాలల దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని పాఠశాల చైర్మన్ అశోక్ రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విశిష్ట వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




