Thursday, 5 November 2026

ఘనంగా బాలల దినోత్సవం

ఘనంగా బాలల దినోత్సవం

వివిధ వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులు

ఫోటోరైటఫ్:అనాజీపురం మోడల్ స్కూల్ లో విద్యార్థుల వేశధారణలు
పెన్ పహాడ్. నవంబర్ 14 (జనం సాక్షి) : భారత దేశం మొదటి ప్రధాన మంత్రి చాచా నెహ్రు జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గుంజా ప్రమీల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా ఆటలు,పాటలు,వివిధ సంస్కృతి కార్యక్రమాలతో పాటు వివిధ వేశధారణలు గావించి చూపరులను కనువిందు చేశారు బాలబాలికలను నాలుగు గ్రూపులుగా చేసి పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ప్రమీల తెలిపారు ఈ పోటీల్లో గెలుపు ఓటమిలను నిర్ణహించేందుకు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు,నాగమణిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు అనంతరం నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు…