మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా సైదులు
ఫోటోరైటఫ్:నియామక పత్రాన్ని అందిస్తున్న అధికారి అశోక్
పెన్ పహాడ్ నవంబర్ 14 (జనం సాక్షి) :మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో నిర్వహించిన మత్స్య సహకార సంఘం కమిటీ ఎన్నికలో అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన నూకల సైదులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అశోక్ కుమార్ మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఎన్నికైన 9 మంది కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించగా ఉపాధ్యక్షడిగామెరిగ లక్ష్మయ్య,కార్యదర్శిగా దాసరి పెద్ద అంజయ్య,కోశాధికారిగా దాసరి మట్టయ్య ఎన్నిక కాగా డైరెక్టర్లుగా లక్కపాక రాములమ్మ, నూకల మంగమ్మ,నిమ్మకాయల కోటమ్మ , కలిమేళ రాములు,పొన్నెబొయిన సైదులు ఎన్నికయ్యారు ఈకార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు




