ఘనంగా బోగి సంబురలు
మరిపెడ, జనవరి 14(జనం సాక్షి ):మూడు రోజులపాటు జరిగే సంక్రాతి సంబురాలు మున్సిపల్ కేంద్రంలోని మార్కెట్ రోడ్డు లో శనివారం బోగి మంటలతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బోగి మంటలు ఏర్పాటు చేసి డిజే పాటలతో నృత్యాలు చేస్తూ సంబురాలు నిర్వహించారు, ఈ కార్యక్రమం లో ముఖ్య అతిదిలు గా ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి నాయక్, స్థానిక కౌన్సిలర్ రేఖ లలిత వెంకటేశ్వర్లు, విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వాసవి క్లబ్ ప్రముఖులు బోనగిరి సురేష్, భరత్,ఉల్లి శ్రీనివాస్,శ్రీరంగం శ్రీనివాస్,ఉదయ్ భాస్కర్, టీఆరెఎస్ నాయకులు గంధసిరి కృష్ణ, టీఆర్ఏస్ పట్టణ సోషల్ మీడియా ఇంచార్జి గోల్కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బోగి సంబురలు




