రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్ కొండమల్లేపల్లి జనవరి 14 జనం సాక్షి న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాదులతో సంతోషంగా జరునుకునే పండుగ సంక్రాంతి పడుగని స్పష్టం చేసారు. కొత్త పంటతో చేసుకునే తీపి పరవన్నాలను కుటుంబ సభ్యులు ఆనందంగా ఆస్వాదించడంమే సంక్రాంతి పర్వదిన గొప్పదనమని అన్నారు. ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంకుచిత విధానాల వల్ల కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేసారు.సంక్రాంతి పల్లెల పండుగ. రైతుల పండుగ అని మొత్తంగా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అని రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలి. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలి. పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో.. ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలి ఆర్యవైశ్య సోదరులకు, రాష్ట్ర ప్రజలకు,రైతు సోదరులకు, ప్రజా ప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మిత్రులకు, కార్యకర్తలకు మా శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూరే లక్ష్మణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు
రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్




