Thursday, 5 November 2026

ఘనంగా భోగి పండుగ

ఘనంగా భోగి పండుగ

మల్దకల్ జనవరి 14 (జనంసాక్షి)మల్దకల్ మండలంలోని పలు గ్రామాలలో శనివారం భోగి పండుగను ఎల్కూరు, తాటికుంట,కుర్తి రావులచెరువు,విఠలాపురం, అమరవాయి,పాలువాయి, పెద్దొడ్డి,నీలిపల్లి,మల్లెందొడ్డి, మేకలసోంపల్లి,ఉలిగేపల్లి తదితర గ్రామాలలో ఘనంగా భోగి పండుగను జరుపుకున్నారు.ఇంటి ముంగిట అందమైన రంగవల్లులు అద్ది వాటిపై గొబ్బెమ్మలు ఉంచి మహిళలు పూజలు నిర్వహించారు.భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేస్తూ చలి కాచుకున్నారు.ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేసి అలంకరణ చేసి గొబ్బెములతో పూజించి మహిళలు మూడు రోజులపాటు ఇంటి ముంగిట ముగ్గులు వేస్తారు.ఇంట్లో పిండి వంటలు చేసుకొని నువ్వుల రొట్టెలు,కలగూరగాయలతో పిండి వంటలు చేసుకొని ఆరగిస్తారు.ఈ సందర్భంగా మల్దకల్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు.ఆదివారం జరిగే మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పలు గ్రామాలలోని దేవాలయాలను ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.