Tuesday, 3 November 2026

ఘనంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు

కొడకండ్ల, జులై04(జనం సాక్షి):రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, బి. ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొడకండ్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ ఆధ్వర్యంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి,ఎంపీపీ జ్యోతి, మార్కెట్ చెర్మెన్ పేరం రాము,మండల రైతు బంధు అధ్యక్షులు ధీకొండా వెంకటేశ్వర్ రావు,స్థానిక సర్పoచ్ పసునూరి మధుసూదన్, ఎంపీటీసీ కుందురు విజయలక్ష్మి-అమరేందర్ రెడ్డి,మాజీ జీసీసీ చెర్మెన్ అభిమాన్ గాంధీ నాయక్ తో పాటు వివిధ ప్రజా మరియు పార్టీ ప్రతినిధులు, నాయకులతో కలసి కేక్ కట్ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని శివాలయంలో, లక్ష్మక్క పల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి పేర ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మంత్రి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మండలం లోని కస్తూరి భా గాంధీ పాఠశాల కు ఫ్యాన్లను అందజేశారు.ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.