జనంసాక్షి, కమాన్ పూర్ : రామగుండంలోని తబిత అనాధాశ్రమంలో చిన్నారులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మంగళవారం కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు ఇజాజ్ ఖాన్-ఫిర్దోస్ ల రెండవ కూతురు తానియా రెండవ పుట్టిన రోజు సందర్భంగా అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనాధలకు అన్నదానం చేయడం పుణ్యకార్యమని తబిత అనాధ ఆశ్రమ నిర్వాహకులు వీరేశ్వర నాయక్ అన్నారు. అలాగే ప్రజలు అనవసరంగా డబ్బులు వృధా చేయకుండా వృద్ధులకు అనాధలకు ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు. అనాధాశ్రమానికి ప్రజలు కూడా చేయూతనివ్వాలని కోరారు. అలాగే తబిత ఆశ్రమ చిన్నారుల మధ్య చిన్నారి తానియా కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాజిద్ ఖాన్ హానియా తో పాటు చిన్నారులు పాల్గొన్నారు.
తబిత ఆశ్రమంలో చిన్నారులకు అన్నదానం




