Tuesday, 3 November 2026

ఘనంగా మల్లన్న జాతర ఘనంగా మల్లన్న జాతర – మల్లన్నా

 

 

 

 

 

 

 

 

శరణు, శరణు అంటూ మారుమ్రోగింది ఆలయ ప్రాంగణం.. – పట్టువస్త్రాలు సమర్పించిన  గ్రామ సర్పంచ్  – మూడు రోజుల పాటు సాగిన  వేడుకలు.. రామారెడ్డి   జనవరి 30   ( జనంసాక్షి)   :
కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో గల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక సోమవారం ఉద‌యం అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయ జయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో మర్మోగింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయ బద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడారు.   మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో అగ్గి గుండాలతో మూసిన బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జనవరిలో  ఆనవాయి తీగా వస్తున్నది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ మహోత్సవం జరిగిందన్నారు. వధువుల తరఫున గొల్ల కులస్తులు కన్యా దానం చేయగా… వరుడి తరఫున  గ్రామ స్తులు కన్యాదానం స్వీకరిం చారు.ఈ వేడుకల్లో  మౌళిక సదుపాయ అభివృద్ది ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షిం చారు. భక్తులు మాట్లాడుతూ,  మల్లన్న దేవుడి దయతో,  రామారెడ్డి మండల ప్రజలు గొల్లపల్లి గ్రామస్తులు పిల్లాపాపల తో వర్ధిల్లుతూ దేవుని కృప కటాక్షం ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ పాల లావణ్య మల్లేష్, కృష్ణ యాదవ్ పెద్ద మల్లేష్ యాదవ్ కిషన్ యాదవ్ గొల్ల కురుమ సంఘ సభ్యులు పెద్దమనుషులు, గ్రామ టీఆరెస్ అద్యక్షుడు రెడ్డి మళ్లేష్ ,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు