అమరవీరుల స్మారక దినోత్సవం* నివాళులు అర్పించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
టేకులపల్లి, జనవరి 30(జనం సాక్షి): జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గల గాంధీ విగ్రహానికి ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నర్సింగ్ నాయక్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా చేసుకుని అఖండ భారతావని స్వాతంత్రానికి పోరాటం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. అదేవిధంగా జాతిపిత గాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న జాతీయ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. భరతమాత విముక్తి కోసం స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో ప్రాణ త్యాగాలను చేశారన్నారు.ఆ త్యాగమూర్తుల త్యాగాలు వృధా కాకుండా త్యాగమూర్తుల జ్ఞాపకార్థం నేడు స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, భూక్య రాధా, వైస్ ఎంపీపీప్రసాద్, బేతంపూడి సొసైటీ అధ్యక్షులు సురేందర్రావు, సర్పంచ్ మాలోతు సురేందర్, బానోత్ కిషన్ నాయక్, బానోతు రవి నాయక్, భూక్య సైదులు నాయక్, జాటోత్ నరేష్ నాయక్, అజ్మీర శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




