Wednesday, 4 November 2026

ఘనంగా మహిళా దినోత్సవం

 

 

 

 

 

 

వేములవాడ, మార్చి 13 (జనం సాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం గోదావరి అర్బన్ మల్టీ స్టేట్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వివిధ రంగాలలో కృషి చేస్తున్న మహిళలను బ్యాంకు మేనేజర్ శ్రీ రాముల వేణు శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది గొట్టం మహేష్, దొంతినేని శ్రీనివాసరావు రంగు స్రవంతి బూరుగుపల్లి సాయి శివ తదితరులు పాల్గొన్నారు.