నెన్నెల, మార్చ్ 6, (జనంసాక్షి )నెన్నెల మండలం గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సర్పంచ్ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలను సన్మానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ సృష్టి జీవం మహిళా అని, మహిళలు అన్ని రంగాల్లో రాణించి ముందుకు పోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ సుజాత, వార్డు సభ్యురాలు ఉమాదేవి, మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.




