Wednesday, 4 November 2026

సింగరేణి మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలి.

 

 

 

 

 

 

ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్………సింగరేణిలో పని చేస్తున్నటువంటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సింగరేణిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని యాజమాన్యాన్ని ఐఎన్టియుసి పక్షాన యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు .జీవో నెంబర్ 433 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటించిందని దానిని దృష్టి లో పెట్టుకొని సింగరేణి యాజమాన్యం కూడా మన సింగరేణి సంస్థ లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని దాని ద్వారా యాజమాన్యం మహిళలకు ఇచ్చే గౌరవం పెరుగుతుందని అన్నారు…………జనం సాక్షి