Thursday, 5 November 2026

ఘనంగా మాజీ సీఎం రోశయ్య వర్ధంతి.

ఘనంగా మాజీ సీఎం రోశయ్య వర్ధంతి.
బెల్లంపల్లి, డిసెంబర్ 4, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనేజేటి రోశయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా వ్యవహరించారని, ఎక్కువకాలం ఆర్థిక శాఖ మంత్రిగా చేయడం గర్వకారణం అన్నారు. ఏ పదవి అలంకరించినా ఆ పదవికి వన్నె తెచ్చిన అజాత శత్రువు అన్నారు. ఈకార్యక్రమంలోపాల్గొన్నవారు
బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత భాస్కర్, యువజన సంఘం అధ్యక్షుడు పుల్లూరు వెంకటేశ్వర్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు బాల విజయలక్ష్మి, బాల సంతోష్, చిలువేరు శ్రీధర్, కిరణ్ కుమార్, గోగుల శ్రీనివాస్, కోట విజయ్, నల్మాస్ సంతోష్, నరేందుల వేణుగోపాల్, రాచర్ల విగ్నేష్, కౌటారం గణేష్, మహిళా సంఘం నాయకురాళ్లు చిలువేరు నికిత, రాచర్ల దీపిక, రాచర్ల సునీత, కొమరవెల్లి శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.