అందరివాడు డిఎన్ఆర్..
– కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయూబ్ పాషా.
ఊరుకొండ, డిసెంబర్ 4 (జనంసాక్షి):
పార్టీలకతీతంగా కుల మత బేద తారతమ్యం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరివాడు అనిపించుకుంటున్న మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) గొప్ప నాయకుడని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయూబ్ పాషా అన్నారు. ఆదివారం ఊర్కొండ మండలంలోని రేవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కురిమిద్దె శాంతయ్య కుమారుడు అర్జున్(24) వివాహానికి.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.. నిఖిలన్న యువసేన పేరిట రూ.5116/- పెళ్లి కానుక అందజేశారు. ఇట్టి నగదును నవ దంపతులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలిచి.. ఎవరికి ఏ ఆపద వచ్చినా యుద్ధ ప్రతిపాధికన.. అన్నా..అంటే.. నేనున్నా అంటూ పెద్ద కొడుకులా ఆర్థిక సహయాలు చేస్తూ, మరణించిన వారి అంతిమ సంస్కారాలకు రూ.5వేలు తక్షణ ఆర్థిక సహాయం మరియు నిరుపేద యువతి, యువకుల వివాహానికి పెద్దన్నలా పెళ్లి కానుకలు అందజేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. మండలంలో సేవాగుణానికి ద్యాప నిఖిలన్న నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్వలయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు కురిమిద్దె జంగయ్య, ఎర్రోళ్ల పరుష రాములు, బాలస్వామి, వెంకటయ్య, భీమయ్య, కృష్ణయ్య, రమేష్, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అందరివాడు డిఎన్ఆర్




