ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
దంతాలపల్లి డిసెంబర్23 జనంసాక్షి
మండలం లోని వేములపల్లి గ్రామంలో జే ఫార్మ్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలకు మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ వలాద్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతు లేనిదే రాజ్యం లేదన్నారు.రైతు సంక్షేమమే దేశ సంక్షేమమన్నారు.వేడుకల్ని నిర్వహిచిన సంస్థ వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంత,ఏరియా మేనేజర్ ఎం దీక్షిత్, ఫీల్డ్ ఆఫీసర్ ఎం సందీప్,రైతులు పర్శయ్య, రవీందర్ రెడ్డి, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.




