ఘనంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 20:: తూప్రాన్ మండలం వెంకటాపూర్ శివారులో గల శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది దేవీ ఉపాసకులు ఆలయ ధర్మకర్త సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో మహిళలు భక్తిశ్రద్ధలతో జ్యోతులు వెలిగించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు మొదటగా సోమయాధుల రవీంద్ర శర్మ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మేల తాళాలతో అమ్మవారిని పూజించిన అనంతరం మొదట జ్యోతిని అమ్మవారి సమక్షంలో రవీంద్ర శర్మ వెలిగించారు అనంతరం మహిళలు కుటుంబ సభ్యులతో సహా లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని జ్యోతులను వెలిగించారు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదంతో పాటు మహా ప్రసాదాన్ని అందజేశారు వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి అమ్మవారి లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఘనంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం




