Thursday, 5 November 2026

శ్రీ సత్యసాయి సేవా సమితిచే రక్తదానం

శ్రీ సత్యసాయి సేవా సమితిచే రక్తదానం

మిర్యాలగూడ, జనం సాక్షి :
శ్రీ సత్యసాయి బాబా 97 వ జయంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా కమిటీ కన్వీనర్ చిల్లంచర్ల ఆదినారాయణ మాట్లాడుతూ సత్యసాయి సేవాసమితి, నల్గొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం తో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశామన్నారు.శిబిరం లో 20 మంది రక్తదానం చేసారని అయన తెలిపారు.కార్యక్రమం లో సమితి జిల్లా అధ్యక్షులు డి. శ్రీనివాస్ తో బాటు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.