ఘనంగా వాసవిమాత ఆత్మ అర్పణ దినం.
బెల్లంపల్లి, జనవరి 23, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం ఆత్మ అర్పణ దినం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మ అర్పణ దినం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉదయం 6 గంటలకు ప్రత్యేకంగా పంచామృతాలు పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆర్యవైశ్య మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు పటించారు. సాయంకాలం 7:00కు భజన కార్యక్రమం చేపట్టనున్నారు. తదనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పవళింపు సేవా కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ అధ్యక్షుడు నరేందుల వేణుగోపాల్, తనుకు నవీన్, గౌరవాధ్యక్షుడు చిలివేరు దయాకర్, తణుకు కుమారస్వామి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎలుక వెంకటేష్, ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు బాల విజయ, సింధుజ, చిలివేరు నికిత, నరేందుల లక్ష్మి, నరేందుల సంజన, ఆర్యవైశ్య సభ్యులు గోగు శ్రీనివాస్, తనకు ప్రవీణ్, బాల వెంకటేష్, దంతుల రామకృష్ణ, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రేణిగుంట్ల శ్రీనివాస్, నరెందుల రామకృష్ణ, బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా వాసవిమాత ఆత్మ అర్పణ దినం.




