టేకులపల్లి, జనవరి 23( జనం సాక్షి ): కోయగూడెం ఉపరితల గనిలో ఓబీ పనుల నిర్వహణలో ముందున్న వోల్వోను ఢీకొట్టడంతో ఢీకొట్టిన వోల్వో లో ఉన్న డ్రైవర్ కు కాలు విరిగి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. 9మైల్ తండా గ్రామానికి చెందిన మట్టి తోలకాలు నిర్వహించే వోల్వో వాహనం డ్రైవర్ బానోత్ శంకర్ సోమవారం ఉదయం వోల్వోతో మట్టి తోలకం రవాణా చేస్తుండగా పొగ మంచు వలన ముందు ఆగి ఉన్న వాహనం కనిపించకపోవడంతో ఢీకొట్టాడు. దీంతో వోల్వో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు కాగ డ్రైవర్ శంకరకు కుడికాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వైద్యశాలకు తరలించారు. శంకర్ కు ప్రాణాపాయం లేనప్పటికీ కాలు నుజ్జునుజవడంతో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.




