హుజూర్ నగర్ ఏప్రిల్ 24 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని విశ్వతేజ స్కూల్ లో ఫేర్వెల్ పార్టీ వేడుకలను సోమవారం కరస్పాండెంట్ బూర శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపాల్ ఊర్మిల ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ పిల్లలు ఆటపాటలతో, డాన్సులతో సందడి చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థినీ, విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం స్కూల్ పిల్లలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీలు మనీషా, ఉషారాణి, రమాదేవి, జ్యోతి, జాగృతి పట్టణ మహిళా అధ్యక్షురాలు షేక్. రహీమా, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




