Wednesday, 4 November 2026

బీరప్ప జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

 

 

 

 

 

 

జనం సాక్షి జోగుపేట ఆందోల్ మండల పరిధిలోని పోసనీపేట గ్రామంలో సోమవారం బీరప్ప స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పోసానిపేట గ్రామంలో బీరప్ప గుడి లేదని బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ అడగగా గుడి స్టార్ట్ చేయండి డబ్బులు ఎంతైనా పర్వాలేదు అంటూ హామీ ఇచ్చిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట ఇచ్చిన ప్రకారం సోమవారం అదే జాతర ఉత్సవంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం అని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు అదేవిధంగా యాదవులు ఐక్యమతంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ బీరప్ప దేవుడు సల్లగా చూడాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జోగు బాలయ్య గ్రామ సర్పంచ్ స్వప్న శ్రీనివాస్ యాదవ్ వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి అందోల్ మండల సర్పంచ్ పురం అధ్యక్షుడు వెంకటరెడ్డి ప్రవీణ్ రెడ్డి. ఆందోల్ మాజీ ఎంపీపీ రామ గౌడ్ మండలం ఆత్మ కమిటీ చైర్మన్ పతీ వీరేశం పోసానిపేటగ్రామ బి ఆర్ఎస్ నాయకులు యాదవులు పాల్గొన్నారు