.ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…
బై0సా రూరల్ మార్చ్ 30 జనం సాక్షి
నిర్మల్ జిల్లా భైంసాలో శ్రీరామనవమి శోభయాత్రను భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్,బీజేపి జిల్లా అద్యక్షురాలు రమాదేవి, బిజెపి నాయకులు రామారావు పటేల్,మోహన్ రావ్ పటేల్,హిందువాహిని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరై ప్రారంభించారు. శోభయాత్ర పురాణ బజార్ గోశాల నుండి ప్రారంభమై బట్టి మీదుగా సాగి గాంధీ గంజ్,బస్టాండ్,నిర్మల్ చౌరస్తా,మీదుగా రామ్ లీలా మైదానం వరకు కొనసాగుతుంది. పలువురు గ్రామ భక్తులు శ్రీరాముని విగ్రాహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి… శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బైంసా సునీత ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైంసా ఏఎస్పీ కట్టుదిడ్డమైన భద్రతను ఏర్పాటు చేశారు.శోభయాత్రలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కువ మొత్తంలో ప్రజలు హాజరయ్యారు.
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు




