Monday, 2 November 2026

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొనాలి

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అధికసంఖ్యలో పాల్గొనాలిబిఆర్ఎస్ మండల నాయకులు బాల్నె వెంకన్నజనం సాక్షి,చెన్నారావుపేట
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిల ఆదేశాల మేరకు చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ క్లస్టర్ లో మార్చి 31 న శుక్రవారం ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెన్నారావుపేట మండల బిఆర్ ఎస్ మండల నాయకులు,తోపనగడ్డ తండ గ్రామ క్లస్టర్ ఇంచార్జి బాల్నె వెంకన్న అన్నారు.గురువారం మండలంలోని తోపనగడ్డ తండా, లింగగిరి, కందిగడ్డ తండా,  గ్రామాలలో బిఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమీనాబాద్ గ్రామంలోని రైతు వేదిక సమీపంలో నేడు శుక్రవారం ఉదయం 10గంటలకు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అమీనాబాద్ క్లస్టర్ పరిధిలోని ఖాదర్ పేట, అమీనాబాద్,పత్తి నాయక్ తండ,లింగగిరి,తోపనగడ్డ తండ, బాపునగర్, కందిగడ్డ తండ, శంకరం తండ, గొల్లపల్లి, గొల్లభామ తండ, సూర్యపేట తండ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్ధసాని సత్యనారాయణ రెడ్డి , రైతుబంధు మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, ఖాదర్ పేట గ్రామ సర్పంచ్ అనుముల కుమారస్వామి, తోపనగడ్డ తండా గ్రామ సర్పంచ్ బానోత్ శ్రీనివాస్, కంది గడ్డ తండా గ్రామ సర్పంచ్ గుగులోతు రాజమ్మ,సూర్యాపేట తండా గ్రామ సర్పంచ్ ధరావత్ కిషన్, ఎంపిటిసి ధారావత్ శ్రీనివాస్, గొల్లపల్లె  గ్రామ సర్పంచ్ బానోత్ రమేష్,  పరకాల రాజన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ, రెడ్యా, మాలోతు వీరన్న, మాదారపు శ్రీనివాస్,కన్నె విజేందర్, నాయకులు గుగులోతు స్వామి నాయక్,  బూరుగు రాజశేఖర్, మెడబోయిన కుమార్, మంద ఏకాంబరం, ఓరుగంటి నరసింహారావు, సారమైన రాజు, గట్టు విష్ణు, ధారావత్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.