Wednesday, 4 November 2026

ఘనంగా శ్రీ యోగా నరసింహస్వామివారి తెప్పోత్సవం డోలోత్సవం

 

 

 

 

 

 

 

ధర్మపురి 07 మంగళవారం (జనంసాక్షి) జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హోలి పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుండే స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. బ్రహ్మోత్సవాలతో ధర్మపురి పట్టణం ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకుంది.భక్తుల లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సాయంత్రం 4 గం||లకు స్థానిక బ్రహ్మపుష్కరిణి (కోనేరు) లో శ్రీ యోగా నరసింహస్వామి వారి తెప్పోత్సవం వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల జయజయధ్వానాలు, గోవిందనామస్మరణ ల మధ్య ఘనంగా జరిగింది. అనంతరం బ్రహ్మపుష్కరిణి మంటపంలో శ్రీ యోగా నరసింహస్వామి డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు బ్రహ్మపుష్కరిణి కి చేరుకొని గోవిందా నామస్మరణ చేస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ యోగా నరసింహస్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యి స్వామివారిని దర్శించుకొనున్నారు.జిల్లా కలెక్టర్ యాష్మిన్ బాషా ఆదేశానుసారం ఆలయ అధికారులు భక్తులు అందరూ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ లను ఆలయంలో రెండు స్క్రీన్ లను, ఆలయం బయట ఒక స్క్రీన్, ఇసుక స్తంబం వద్ద ఒక స్క్రీన్, నంది చౌరస్తా వద్ద ఒక స్క్రీన్, గోదావరి నది తీరాన మంగలి ఘాట్ వద్ద ఒక స్క్రీన్ మొత్తం ఆరు స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆన్నదాన కార్యక్రమం, త్రాగునీరు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆర్టీసి వారు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేశారు.జిల్లా ఎస్పి భాస్కర్, డిఎస్పి ప్రకాష్ ఆదేశానుసారం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు సిఐ కోటేశ్వర్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పార్కింగ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎస్ ఐ కిరణ్ తెలిపారు.ఈ యోగా నరసింహస్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకుటాల శ్రీనివాస్, రేనోవేషన్ సభ్యులు ఇందారపు రామన్న,అక్కేనపెల్లి సురేంధర్,వీరవేని కొమురయ్య,చుక్క రవి, స్తంభంకాడి మహేష్,ఇనుగంటి రమ వెంకటేశ్వరరావు,గునిశెట్టి రవీంధర్,పల్లెర్ల సురేంధర్,గుంపుల రమేష్, వేముల నరేష్,జైన రాజమౌళి,సంగెo సురేష్,గందె పద్మ శ్రీనివాస్,డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ,జడ్పిటిసి బత్తిని అరుణ, ఎంపిపి చిట్టి బాబు, ఎఎంసి ఛైర్మెన్ అయ్యోరి రాజేష్, ఎఎంసి వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్, తహశీల్దార్ వెంకటేష్, కమిషనర్ రమేష్, డిపిఆర్వో దశరథం,కొండయ్య ధర్మపురి,
ధర్మపురి పరిసర ప్రాంతాలతో పాటు, సుదూర ప్రాంతాలైన మహారాష్ట్ర,నిజామాబాద్, ఆర్మూర్,నిర్మల్ వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.