జుక్కల్, మార్చి 07,( జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలములో మంగళవారము ప్రజలు హోళీ పండుగను ఘనంగా జరుపు కున్నారు.పిల్లలు, యువకులు, వృద్ధులు,మహిళలు అని తేడాలేకుండా
అందరు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. కుడుక, చక్కెర పేర్లను ఇచ్చిపుచ్చుకున్నారు.కొందరు మహిళలు, పురుషులు ఇల్లిల్లు పాటలు పాడుతు తిరిగి దానాలు స్వీకరించారు. సోమవారం రాత్రి ప్రతి గ్రామంలో కామదహన కార్యక్రమం నిర్వహించారు




