: శామీర్ పేట్, జనం సాక్షి :విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే దృక్పథంతో శ్రీ వత్సల్ గురుకుల్ విద్యాసంస్థ కృషి చేస్తుందని ప్రిన్సిపాల్ సంగీత అన్నారు. సోమవారం బాబగూడ గ్రామ పరిధిలోని శ్రీ వత్సల్
గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురుపౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ..
అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా తమ శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురుశిష్యుల సంబంధాలు చాలా అరుదు. గురువు యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేసే క్రమంలో గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసుని మరియు గురువులు యొక్క విశిష్టతను తెలియజేస్తూ శ్రీవస్థల గురుకుల విద్యా సంస్థ పెద్ద ఎత్తున వ్యాస మహర్షి పూజా కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులకు వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని గురువుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ వత్సల్ గురుకుల విద్యాలయంలో గురు పూర్ణిమ వేడుకలు




