
మోమిన్ పేట జులై 3 జనం సాక్షి
మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు సోమవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలో 30 లక్షల నిధులతో నూతనంగా నిర్మించబోయే ముస్లిం గ్రీన్ యార్డ్ ప్రహరీ గోడ కమ్యూనిటీ హాల్, ఉర్దూ భవనము* మరియు ఈద్గా ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మోమిన్ పేట సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ ఎంపీపీ వసంత రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు గ్రహీత నరసింహారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ శనేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ దళిత రత్న అవార్డు గ్రహీత బిచ్చయ్య ముస్లిం మత పెద్దలు ఎండి ఆజం డాక్టర్ ఎండి ఆఫీస్ మహబూబ్ అలీ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీలు తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”




