Wednesday, 4 November 2026

ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబా ఐదో వార్షికోత్సవ వేడుకలుఆలయ ప్రాంగణంలోపేదల కోసం పాలి క్లినిక్,డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం

 

 

 

 

 

 

 

 

 

మల్కాజగిరి.జనంసాక్షి.ఏప్రిల్24 పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని యాప్రాల్ పరిధిలోని మల్లన్న స్వామి దేవాలయ ప్రాంగణంలోని షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.షిరిడి సాయిబాబా ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 22 వ తేదీ నుండి 24 వరకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం తక్కువ ధరలకే వైద్య సేవలు అందించేందుకు శ్రీ సాయి పాలీ క్లినిక్ డయాగ్నోటిక్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.యాప్రాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారని,వైద్యం కోసం కార్పొరేట్ హాస్పటల్ వెళ్లలేని పరిస్థితి ఉందని వారిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలకే వారికి వైద్య సేవలు అందించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అశ్విని డయాగ్నొస్టిక్ సెంటర్ వారి సహకారంతో ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ప్రముఖ వైద్యులు శ్రీధర్ మాట్లాడుతూ.ఆలయ కమిటీ వారితో కలిసి తన వంతు సహకారంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జీకే హనుమంతురావు, అంజయ్య యాదవ్,అల్లం దిలీప్ కుమార్,సంతోష్ రెడ్డి,నరసింహారావు, బాలయ్య యాదవ్,నగేష్ ముదిరాజ్, గడ్డమీద గిరిగౌడ్ పాల్గొన్నారు.