Wednesday, 4 November 2026

పోతురాజు శంకరమ్మ సేవాదళం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

 

 

 

 

ఇటిక్యాల జనం సాక్షి ఏప్రిల్ 24 :  మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన కాశపోగు కర్రె బీసన్న అకాల మరణంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోతురాజు శంకరమ్మ సేవాదళం సభ్యులు పోతురాజు సోమనాద్రి సూచన మేరకు గ్రామానికి చేరుకొని మృతి చెందిన కర్ర బిసన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఐదు వేలు నగదు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాగరాజ్ యాదవ్, దేవేందర్ గౌడ్, తిమ్మాపూర్ రాముడు, చరణ్, మద్దిలేటి. తదితరులు పాల్గొన్నారు.