ఘనంగా సత్య సాయి బాబా జన్మదిన వేడుకలు

మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో బుధవారం శ్రీ సత్య సాయి బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి,70 మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,కేతేపల్లి ఎంపిటిసి తలకంటి శ్యామల రెడ్డి, వీపనగండ్ల మండల రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కేతేపల్లి సత్యసాయిబాబా ట్రస్ట్ చైర్మన్ ధర్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తలకంటి లక్ష్మీ ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.