Thursday, 5 November 2026

ఘనంగా సోనియా గాంధి జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధి జన్మదిన వేడుకలు

రామారెడ్డి డిసెంబర్ 9 :

ఘనంగా సోనియా గాంధి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా రామారెడ్డి కార్యకర్తలతో పాటు జడ్పీటీసీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధి పుట్టినరోజు సందర్భంగా రామారెడ్డి బస్ స్టాండ్ ఆవరణలో ఆమే చిత్రపటానికి పాలభీశేఖం నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆమే ఒడినుండి పురిటి బిడ్డవోలే తెలంగాణ రాష్ట్రం ను డిక్లరేషన్ చసి ఇచ్చిన సోనియమ్మను యావత్ ప్రజానీకం గుండెల్లో పెట్టుకొని ఆదరించాలన్నారు. విద్యర్థీ తెలంగాణ కోసం శ్రీకాంత చారీ ఆత్మ బలిదానం చేసుకుంటే కనీసం అతని ఆతకు శాంతించేందుకు అతని తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అన్నారు. ఉద్యమ వీరులను మరిచారని అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి పేరిట పార్టీ మారీ రామారెడ్డి మండల కేంద్రంలో ఏమి అభివృద్ధి చయాలేదన్నారు. తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం , మన ఊరు మన బడి లో జిల్లా పరిత్తు బాలుర పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న అట్టి నూతన భవణాల కోసం నిధులు మంజూరు చేసీనట్లు. నటించడం నాయకులు ఆచరణలో దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గా గెలవడానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఏవిధంగా డబ్బులు ఇచ్చి గెలిపించారో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టి చూపిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణ తల్లి విగ్రహాల పెడుతున్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ విగ్రహాలు ఊరు వాడలో ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో, కస్తూర్బా పాఠశాల లో అపండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోసానిపేట్ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ , శ్రీనివాస్ రెడ్డి , మోచే శివరాం , కాంగ్రెస్ పార్టీ అనుబంధ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.