ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
మోత్కూరు డిసెంబర్ 9 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణా వరప్రదాయిని సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ,యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు,బ్రెడ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డా,,లక్ష్మీనర్సింహా రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండగోని రామచంద్రు మాట్లాడుతూ ఒక్క గుజరాత్ లో తప్ప బీజేపీని అన్ని చోట్లా ప్రజలు తిరస్కరించారని గుజరాత్ లో లక్షలకోట్ల నిదులు ఖర్చు చేయడం,ఏ ప్రదాని చేయని విదంగా ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్ర ఎన్నికల కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేయడం,ఆప్ పార్టీ బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడం వల్లనే గుజరాత్ లో బీజేపీ విజయం సాధించిందని,దేశంలో మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పడానికి హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే నిదర్శనమని,కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ కో పుట్టినరోజు కానుకను అందించిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా తెలంగాణ లో కూడా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కారుపోతుల వెంకన్న, చిరుమర్తి యాదయ్య, పల్లె బిక్షం , పురుగుల నర్సింహ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




