ఘనంగా జన్మదిన వేడుకలు భీమ్గల్(జనంసాక్షి):మాజీ ప్రధానమంత్రి,కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను భీంగల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నాడు కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీ కే దక్కుతుందని అన్నారు.తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ కళ నెరవేరిందని అన్నారు.తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన దేవత సోనియాగాంధీ అని ఆమె చేసిన సేవలను కొనియాడారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి సోనియాగాంధీ కి బహుమతిగా ఇస్తామని అన్నారు.ఈ వేడుకల్లో డిసిసి జనరల్ సెక్రెటరీ కుంట రమేష్,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పర్స అనంత్ రావ్,పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య,నాగేంద్ర, అవినాష్,రెహమాన్, శివ,విక్రమ్,రంజిత్, ప్రసాద్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జన్మదిన వేడుకలు




