Thursday, 5 November 2026

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం.

గద్వాల రూరల్ మార్చి 13 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హరిజచెర్రి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ మరియు వివిద రాజకీయ.. జిల్లా స్థాయి అధికారులుగా విద్యార్థులు స్వయం పరిపాలన  దినోత్సవం నిర్వహణ చేశారు.. కలెక్టర్ గా విక్రమ్ సింహ,డిఈఓ గా జాన్,ఎంఈఓగా అఖిల్ తేజ, హెచ్ఎంగా కీర్తన,సర్పంచ్ గా దేబోర లు ఒకరోజు పరిపాలనా అధికారులుగా విధులు నిర్వహించారు.. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల హెచ్ఎం రేవతి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థాయి ఉద్యోగలు పొంది..పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు..విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు…విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం రేవతి ఉపాధ్యాయ బృందంతో కలిసి బహుమతులు అందజేసినారు…ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిషోర్ చంద్ర,నీలవతి విద్యార్థులు తదితరులు ఉన్నారు..