గద్వాల రూరల్ మార్చి 13 (జనంసాక్షి):-ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన 11పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎం ఏ ఎల్ డి ప్రభుత్వ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగాలని సూచించారు. ఓటర్ల పేర్లను పరిశీలించి ఓటింగ్ కు పంపాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఆమె వెంట జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ ఉన్నారు.
కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్




