మల్కాజిగిరి.జనంసాక్షి.మే14.ఆనంద్ బాగ్ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఆలయ అర్చకులు తులసి వెంకట రమణ ఆచార్యులు సంకట ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.ఉదయం స్వామికి ఆరాధన,అనంతరం పంచామృత అభిషేకం,ఫల రస సహిత సిందూర అభిషేకం,వస్త్ర అలంకరణ, వివిధ రకాల పండ్లు పూలతో అలంకరణ అనంతరం,లక్ష తమల పాకులతో సహస్రనామార్చన,మహా నివేదన,హారతి మంత్ర పుష్పం,తీర్థ ప్రసాద వితరణ గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు.భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఆలయ
కార్యనిర్వహాణాధికారి ఎబి రవీంద్రరెడ్డి భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ క్లర్క్ సండ్ర సుధాకర్,మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్, రాందాస్ సంతోష్ ముదిరాజ్,మాజీ ధర్మకర్తలు గణేష్,ఆలాపన,భక్తులు రాధ,మాధవి,జయశ్రీ,దుర్గా భవాని, మీనాక్షి,రత్నమాల,పద్మజ,రత్న మాణిక్యం,గిరి బాబు,మధన్ మోహన్ రెడ్డి,సోమనాథ్,అనంత రామన్ భక్తులు పాల్గొన్నారు.




