జనం సాక్షి /కొల్చారం మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 74వ ఘనతతో దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ మంజుల కాశీనాథ్ జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ చంద్రశేఖర్ రావు, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి శ్వేత జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల వద్ద సర్పంచులు జాతీయ జెండా ఆవిష్కరించగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు




