ఫొటో : గణతంత్ర వేడుకల్లో గని అధికారులు.బెల్లంపల్లి, జనవరి 26, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని షాఫ్ట్ వద్ద గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
గని మేనేజర్ సంజయ్ కుమార్ సింహా దేశ నాయకుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి పతాక ఆవిష్కరణ చేసి అందరికీ శుభాాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాంతిఖని నుండి ఉత్తమ కార్మికులుగా ఎంపిక అయిన శ్రీ కే. కరుణాకర్ (హెడ్ ఓవర్ మన్), ఇందురి మల్లయ్యని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పిట్ ఇంజనీర్ బి రాంబాబు, అండర్ మేనేజర్ శ్రీ వర్ధన్, ఇంజనీర్ రాం సాగర్, సంక్షేమ అధికారి టి శ్రీనివాస్, టిబిజికేయస్ పిట్ సెక్రెటరీ దాసరి శ్రీనివాస్, ఏఐటియుసి పిట్ సెక్రెటరీ దాసరి తిరుపతి గౌడ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.




