వీణవంక జనవరి 26 (జనం సాక్షి):- వీణవంక మండల కేంద్రంలో భారత దేశ 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు వారం వీణవంక మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలాలోని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాల యాలు,విద్యాసంస్థలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు.జాతి పిత మహాత్మా గాంధీ,రాజ్యాంగ నిర్మాత డా.బి.అర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాజయ్య ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శేఖర్ రెడ్డి, పి ఎస్ సి ఎస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. పోస్ట్ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ శ్రవణ్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి తోపాటు మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు జెండా ఎగరవేశారు .అనంతరం పిల్లలకు, పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి జెడ్పిటిసి మాడా వనమాల సాధవరెడ్డి వైస్ ఎంపీపీ రాశేట్టి లతా శ్రీనివాస్ మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్ తోబాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు




