ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

*రాబోయే ఎలక్షన్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఖాయం
అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి*పెద్దవంగర ఆగష్టు 21(జనం సాక్షి )పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిని మరిచిపోయిన స్థానిక శాసన సభ్యులు దయలేని దయాకర్ రావుకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో ని సాయి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసాని సురేష్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన మండల విస్తృతస్తాయి సమావేశంలో ముఖ్య అతిథి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అరాచక కుటుంబ పాలన సాగుతోందనీ,
ఈ రాక్షసపాలన అంతమొందించే దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తోందని తెలిపారు. గత పది సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి అండగ.