ఘన స్వాగతం పలికిన మండల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు

విద్యార్థి దశ నుండి చదువుతోపాటు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ వెనుకబడిన వర్గాలను చైతన్యం చేస్తూ అంబేద్కర్ యువజన సంఘాల ద్వారా మహనీయుల జీవిత చరిత్రలను పల్లెల్లో అందరికీ తెలియజేస్తూ మహనీయుల స్ఫూర్తితో రాజకీయంలోకి వచ్చి తన ఆత్మగౌరవ పోరాటంతో జీవితాన్ని ఎన్నో దిశలుగా మార్చుకొని ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే యువతకు మార్గదర్శకునిగా ఉండే వ్యక్తికి ఢిల్లీ బహుజన సాహిత్య అకాడమీ వారు భారతదేశానికి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా చెప్పుకునే వ్యక్తి యొక్క డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అందుకొని తన స్వగ్రామానికి చేరుకున్న మందిపాల్ వెంకట్ కు శంషాబాద్ విమానాశ్రయంలో చౌడాపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు అశోక్,ప్రధాన కార్యదర్శి కోస్గి కుమార్,మొగులయ్య,శ్రీనివాస్,శివకుమార్,రాజు,యాదయ్య,పాండు నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది.