గుడిహత్నూర్*: జనవరి 25( జనం సాక్షి)13 వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గుడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు అధికారులు గ్రామస్థులు ఓటు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు ఎంతో విలువైందన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతీఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సై ఎల్ ప్రవీణ్ కుమార్,ఎంపీడీఓ సునీత, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, సర్పంచ్ జాదవ్ సునీత,కార్యదర్శి రాందాస్, కారోబారి అమీన్ అలీ బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు




