Wednesday, 4 November 2026

ఆయిల్ ఫామ్ సాగుతో స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు

 

ఉద్యాన శాఖ అధికారి రాజశేఖర్

ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 25
ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేస్తే నాలుగు సంవత్సరాల నుండి 25 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అని మండల ఉద్యాన శాఖ అధికారి రాజశేఖర్ ఉన్నారు. బుధవారం మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో రైతువేదిక కార్యాలయంలో పామాయిల్ మొక్కల సాగుపై రైతులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన శాఖ అధికారి రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటల సాగుకు తక్కువ పెట్టుబడి తోపాటు దీర్ఘకాలిక మన్నిక గుణం కలిగి ఉంటుంది ఆయన తెలిపారు.
అలాగే ఆయిల్ ఫామ్ మొక్క సాగులో చీడపీడల బాధ తక్కువగా ఉంటుందన్నారు.
అదేవిధంగా రైతుకు నెలనెలా స్థిరమైన ఆదాయాన్ని ఇస్తూ భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పామాయిల్ మొక్కల పెంపకానికి భారీగా సబ్సిడీ ప్రోత్సాహము అందిస్తుందన్నారు. మొక్క ధర 193 రూపాయలు గాను 173 రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి కేవలం 20 రూపాయలకే ఒక మొక్కను రైతులకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సన్న చిన్నకారు రైతులకు 90%, ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ, ఐదు ఎకరాల పైబడిన రైతులకు 80% సబ్సిడీ ఇచ్చి పంట సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు పామాయిల్ పంటలను సాగు చేసి ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భరత సింహా రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.