Wednesday, 4 November 2026

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు..

.

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ ఏప్రిల్ 07జనం సాక్షీ నిర్మల్ జిల్లా బైంసా మండల కేంద్రంలోని నాగదేవుడి వద్ద శుక్రవారం ఉదయం 3 గంటలకు ప్రమాదం జరిగింది. బైంసా నుంచి నాందేడ్ వైపు వెళుతున్న లహరి నాందేడ్ వైపు నుంచి బైంసా వస్తున్న కారు పట్టణ సరిహద్దు ప్రాంతంలోని నాగదేవత ఆలయం సమీపంలో ఎదురెదురుగా డీ కొట్టడంతో ఘటన చోటుచేసుకుంది బైంసాలోని పిప్పిడి కాలనీ ప్రాంతానికి చెందిన కుటుంబీకులు శిరిడి సాయిబాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది ఇంటికి మరో ఐదు నిమిషాలు చేరుతామని వారందరు భావిస్తుండగా ప్రమాదం జరిగిన తీరని విషాదం నింపింది ప్రమాదం ఘటనలో ఆదిత్య (7), కళవతి (48), లో త్రీవంగా గాయపడి ఆరుగ పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిద్దరిని బైంసాలోని ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సేవల కోసం నిర్మల్ నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించారు. నిర్మల్కు తరలిస్తున్న ఆదిత్య మార్గమధ్యలో మృతి చెందడంతో కుటుంబీకులు రోధిస్తున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన ఐదుగురు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.