వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 06 (జనం సాక్షి)జైశ్రీరామ్.. జై హనుమాన్ అనే నామస్మరణతో వరంగల్ నగరంలోని రంగసాయిపేట మహంకాళి దేవాలయ ప్రాంగణం మార్మోగింది. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా రంగసాయిపేట మహంకాళి దేవాలయ నుండి వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రకు సిద్ధయోగి స్వామి శ్రీ చైతన్య ఆనంద మహారాజ్ హాజరయ్యారు అంతకుముందు ఆయన మహంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం వీర హనుమాన్ విగ్రహానికి హారతులు ఇచ్చి యాత్రను ప్రారంభించారు అదేవిధంగా సామూహిక హనుమాన్ చాలీసా పఠనంతో యాత్ర కొనసాగింది హనుమాన్ శోభాయాత్ర రంగసాయిపేట నుండి వరంగల్ మీదుగా హనుమకొండ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వేలాదిగా వచ్చిన భక్తులు తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, విశ్వహిందూ పరిషత్ బాధ్యులు కేశిరెడ్డి జైపాల్ రెడ్డి, ఆకారపు కేశవరాజు నందాల చందర్ బాబు , శ్రీరామ్ ఉదయ్ కుమార్ అల్లకట్ల సాయికుమార్ తోపాటు వెలగందుల రాజు అనుముల రమేష్, బండి రోహిత్, స్వామినాథం, సుతారి సాయిరాం మల్యాల రవి తోపాటు బిజెపి నాయకులు కొండేటి శ్రీధర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు , రావు పద్మ, ఇనుముల రాకేష్ రెడ్డి మార్తినేని ధర్మారావు, కొల్లూరు యోగానంద్, ఎడ్ల అశోక్ రెడ్డి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, కెడల పద్మ జనార్ధన్, దిడ్డి కుమారస్వామి, పోశాల పద్మ తో పాటు రంగసాయిపేట యూత్ ఫోర్స్ సభ్యులు తదితరులు హాజరయ్యారు.




